పెద్దపల్లిలో బైపాస్, పోలీస్ స్టేషన్ నిర్మాణ స్థలాలను పరిశీలించిన విప్

47చూసినవారు
పెద్దపల్లిలో బైపాస్, పోలీస్ స్టేషన్ నిర్మాణ స్థలాలను పరిశీలించిన విప్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు, పెద్దపల్లి మండలంలోని పెద్దకాల్వల మీదుగా నూతన బైపాస్ రోడ్డు నిర్మాణం, పట్టణ కేంద్రంలోని పాత గ్రంధాలయ భవనాన్ని తొలగించి నూతన భవన నిర్మాణం కోసం స్థలాలను పరిశీలించారు. అనంతరం, బంధంపల్లిలో నూతన రూరల్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి స్థలాన్ని పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ, ఏసీపీ, సీఐ, ఎస్ఐ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్, పలు గ్రామాల సర్పంచ్‌లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్