జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేస్తూ, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చైన్ మేన్ రఘును సస్పెండ్ చేశారు. మంథని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో డిప్యూటీషన్ పై పనిచేస్తున్న రఘు, జనవరి 13 నుండి ఎలాంటి సమాచారం అందించకుండా విధులకు గైర్హాజరయ్యారు. ఆర్డీఓ నివేదిక ఆధారంగా, విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.