మంథనిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం: మంత్రి శ్రీధర్ బాబు

511చూసినవారు
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని పోచమ్మ వాడలో మంథని PACS ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని, ఏవైనా ఇబ్బందులుంటే కలెక్టర్, ఆర్డీఓ, ఎమ్మార్లకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, స్థానిక రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్