తెలంగాణలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ నిధుల ద్వారా రూ. 35.19 కోట్లు మంజూరు చేయడాన్ని పురస్కరించుకుని, శుక్రవారం ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్రామ ప్రజలు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణపై భక్తి, ప్రేమతో కొండగట్టు ఆలయానికి ఈ నిధులను మంజూరు చేశారని, ఆయన కొండగట్టు అంజన్నకు పునర్జన్మనిచ్చారని గ్రామస్తులు తెలిపారు.