పెద్దపల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ

3చూసినవారు
పెద్దపల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లి ఆదర్శనగర్ వద్ద గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని నీర్ల నరసమ్మ (50) మృతి చెందింది. కుమార్తె ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన నరసమ్మ భర్త వెంకన్న గతనెల 10న గుండెపోటుతో మృతి చెందాడు. 20 రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందడంతో ఆదర్శనగర్ లో విషాదం నెలకొంది. నరసమ్మకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఎస్సై ప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.