మంథనిలోని శ్రీ సాయి ఫ్యామిలీ రెస్టారెంట్‌కు మళ్లీ అనుమతులు ఇచ్చారు. జిల్లాలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మే 29న తనిఖీల్లో అపరిశుభ్రత గుర్తించడంతో మంథనిలోని శ్రీ సాయి ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ మెస్‌ను తాత్కాలికంగా మూసివేశారు. నిర్వాహకులు లోపాలు సరిదిద్దడంతో ఫుడ్ సేఫ్టీ అధికారుల పునఃపరిశీలన అనంతరం జూన్ 4 నుంచి తిరిగి నిర్వహణకు అనుమతి ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించే హోటళ్లపై కఠిన చర్యలు కొనసాగుతాయని కలెక్టర్ హెచ్చరించారు.