మంథనిలో పోలియో చుక్కల కార్యక్రమం: కౌన్సిలర్ అవగాహన

892చూసినవారు
మంథనిలో పోలియో చుక్కల కార్యక్రమం: కౌన్సిలర్ అవగాహన
పెద్దపల్లి జిల్లా, మంథని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపురి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఆదివారం 0-5 సంవత్సరాల చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 4వ వార్డు కౌన్సిలర్ ఎరుకల స్రవంతి రమేష్ బాబు పాల్గొని, తల్లిదండ్రులకు పోలియో చుక్కల ప్రాముఖ్యతను వివరించారు. ఏఎన్ఎం అన్నపూర్ణ, ఆశ వర్కర్ వేముల శ్రీదేవి కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. "ప్రతి చిన్నారికి రెండు చుక్కలు... పోలియో రహిత భారతదేశం మనందరి లక్ష్యం" అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

సంబంధిత పోస్ట్