కొనుగోలు పారదర్శకంగా, వేగవంతంగా సాగాలి: కలెక్టర్

886చూసినవారు
కొనుగోలు పారదర్శకంగా, వేగవంతంగా సాగాలి: కలెక్టర్
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రైతుల వద్ద ధాన్యం కొనుగోలు పారదర్శకంగా, వేగంగా జరగాలని ఆదేశించారు. సోమవారం సుల్తానాబాద్ మండలంలోని సుగ్లాంపల్లి పిపిసి ప్యాడి ప్రొక్యూర్మెంట్ కేంద్రాన్ని సందర్శించి, కొనుగోలు ప్రక్రియను సమీక్షించారు. రైతులు తెచ్చే ధాన్యం ఎఫ్‌ఏక్యూ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, తూకం, తేమ శాతం కొలతలు సక్రమంగా నిర్వహించాలని, ఆలస్యం లేకుండా రైతులకు రశీదులు ఇవ్వాలని సూచించారు. ధాన్యం మిల్లులకు తరలించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్