2027 గోదావరి పుష్కరాల కోసం ఘాట్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ, లైటింగ్, ఆలయాల అభివృద్ధి వంటి ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంథని ఆర్డిఓ కార్యాలయంలో జరిగిన సమీక్షలో, 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే మహా పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం పనులు చేపట్టాలని సూచించారు. ప్రతిపాదనలను త్వరగా సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.