మనిషి పుట్టడం, గిట్టడం సర్వసాధారణమేనని, అయితే ఉన్నన్ని రోజుల్లో కుటుంబానికి, సమాజానికి చేసిన సేవలే జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంథని మండలం చిల్లపల్లి గ్రామంలో మాజీ ఎంపీటీసీ పిక్కల పెద్ద రాజయ్య ప్రథమ వర్థంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, రాజయ్య కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో బంధుత్వాలు, ప్రేమ అనురాగాలు కరువవుతున్న తరుణంలో తండ్రి జ్ఞాపకాలను నిలిపేలా రాజయ్య కుటుంబం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వించదగిన విషయమన్నారు.