పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం కలెక్టరేట్ లో ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెద్దపల్లి- కాటారం పరిధిలో రోడ్డు విస్తరణ, బ్రిడ్జి నిర్మాణ పనులు, లింగాపూర్ రోడ్డు విస్తరణ, పైప లైన్ పనులు వేగవంతం చేయాలని, విద్యుత్ స్తంభాల తరలింపు పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.