పెద్దపల్లి జిల్లా మంథని నుంచి ప్రారంభమైన శబరిమల మహా పాదయాత్ర మంగళవారం 35వ రోజుకు చేరుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులు దాటి 850 కిలోమీటర్లు ప్రయాణించి తమిళనాడుకు చేరుకున్నారు. మరో 16 రోజుల్లో శబరిమల చేరుకుంటారని అంచనా. ఈ మహా పాదయాత్రలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అయ్యప్ప స్వాములు నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో పాల్గొంటున్నారు.