అభివృద్ధి పనులను పరిశీలించిన సర్పంచ్

1చూసినవారు
అభివృద్ధి పనులను పరిశీలించిన సర్పంచ్
చిల్లపల్లి గ్రామ సర్పంచ్ గోపు సంతోష్ కుమార్ గ్రామంలో జరుగుతున్న రోడ్డుపక్కన పొదల తొలగింపు, సర్కార్ తుమ్మ చెట్ల శుభ్రత, 8వ వార్డ్ లో హ్యాండ్‌పంప్ వద్ద సోక్‌పిట్ నిర్మాణ పనులను పరిశీలించారు. గ్రామంలో తాగునీటి సౌకర్యాలు, రోడ్ల అభివృద్ధి, పరిశుభ్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామ్‌కిషోర్, గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు వేల్పుల నరేష్, అక్కపాక లింగయ్య, గ్రామ యువకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్