ఉపాధి హామీ పనులు ప్రారంభించిన సర్పంచులు

1చూసినవారు
ఉపాధి హామీ పనులు ప్రారంభించిన సర్పంచులు
చిల్లపల్లి, దుబ్బపల్లి సర్పంచుల అభ్యర్థన మేరకు, మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాలు, RG 1-GM ఏరియా లలిత్ కుమార్ అనుమతితో, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సింగరేణి ప్లాంటేషన్ ప్రాంతంలో కాంటూర్ ట్రెంచ్ తవ్వకం పనులు ప్రారంభమయ్యాయి. డీజీఎం (ఫారెస్ట్రీ) భానోత్ కర్ణ ఆధ్వర్యంలో మొదలైన ఈ పనులు, గ్రామీణ పేదలకు 100 రోజుల ఉపాధి కల్పించి ఆదాయాన్ని పెంచనున్నాయి. ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా చేపట్టడం ద్వారా ప్రజలకు ఉపాధితో పాటు ఆర్థిక భద్రత కలుగుతుందని భానోత్ కర్ణ తెలిపారు.
Job Suitcase

Jobs near you