వరి వంగడాలపై రైతులకు శాస్త్రవేత్తల అవగాహన

0చూసినవారు
వరి వంగడాలపై రైతులకు శాస్త్రవేత్తల అవగాహన
పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిల్లపల్లి గ్రామంలో 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమం జరిగింది. జగిత్యాల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్ పి. అరుణ్ కుమార్, డాక్టర్ టి. శ్రావణ్ వివిధ వరి వంగడాలు, నీటి ఆదా, యూరియా వాడకం, రసాయనాల వాడకంపై రైతులకు వివరించారు. పంట అవశేషాలు కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం, విశ్వోగ్రత పెరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శివ కుమార్,  చిల్లపల్లి గ్రామ సర్పంచ్ గోపు సంతోష్, ఉప సర్పంచ్ రాణి, బెస్తపల్లి సర్పంచ్ అరిపెల్లి శ్రీనివాస్, వార్డ్ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్