అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా, నవంబర్ 19న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం అవగాహన మరియు సాధక బాధకాలపై సదస్సు నిర్వహించబడుతుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి సీనియర్ సిటిజన్స్ హాజరు కావాలని మంగళవారం సీనియర్ నాయకులు ఉత్తమ కవి, నూనె రాజేశం తెలిపారు.