మంథనిలో శివ కళ్యాణం, దీపోత్సవం: మంత్రి శ్రీధర్ బాబు హాజరు

699చూసినవారు
పెద్దపల్లి జిల్లా మంథనిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు కార్తీక మాసం దీపోత్సవం, శివ కళ్యాణం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు పలువురు వీఐపీలు హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు. మంథని మున్సిపల్ మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ దైవ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్