పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటరిని కాలనీ ఆర్.జి (3) పరిధిలోని పోస్ట్ ఆఫీస్‌కు సింగరేణి యాజమాన్యం 15 రోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేసింది. దీనితో ఆర్జీ 3 ప్రాంతంలోని సింగరేణి కార్మికులు, సామాన్యులు, వృద్ధులు వంటి ఖాతాదారుల లావాదేవీలు నిలిచిపోయాయి. పోస్ట్ ఆఫీస్‌కు వస్తున్న కస్టమర్లు తమ బాధను వ్యక్తం చేస్తూ, వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.