పెద్దపల్లి జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని జడ్పీ సీఈఓ నరేందర్ తెలిపారు. గురువారం ఆయన జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్యతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జిల్లా పరిధిలో 263 గ్రామపంచాయతీ సర్పంచ్, 263 ఉపసర్పంచ్, 2432 వార్డు సభ్యుల ఎన్నికలు 3 విడతల్లో జరుగుతాయని వివరించారు. మొదటి విడత డిసెంబర్ 11న, రెండవ విడత డిసెంబర్ 14న, మూడవ విడత డిసెంబర్ 17న ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.