విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు అందించాలి: కలెక్టర్

1చూసినవారు
విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు అందించాలి: కలెక్టర్
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 90 శాతం మంది విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ లో జరిగిన సమీక్షలో, సుల్తానాబాద్, ముత్తారం, జూలపల్లి, ధర్మారం, ఎలిగేడు, కమాన్ పూర్ మండలాల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల హెడ్ మాస్టర్లతో ఆయన మాట్లాడారు. ప్రాథమిక తరగతుల విద్యార్థులకు ప్రతిరోజూ కనీసం అరగంట తెలుగు, ఇంగ్లీషు పఠనంపై దృష్టి సారించి, చదివే అలవాటును ప్రోత్సహించాలని సూచించారు.