లీగల్ ఎయిడ్ క్లినిక్ ను సద్వినియోగం చేసుకోవాలి..

0చూసినవారు
లీగల్ ఎయిడ్ క్లినిక్ ను సద్వినియోగం చేసుకోవాలి..
పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ లోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సోమవారం సీనియర్ సిటిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ప్రారంభించారు. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ క్లినిక్ ను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. సీనియర్ సిటిజన్లు ఈ న్యాయ సహాయ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమం జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ పెద్దపల్లి ఆధ్వర్యంలో జరిగింది.

సంబంధిత పోస్ట్