మంథని రేణుక ఎల్లమ్మ దేవాలయం చైర్మన్ గా తాటి బాలయ్య గౌడ్

796చూసినవారు
మంథని రేణుక ఎల్లమ్మ దేవాలయం చైర్మన్ గా తాటి బాలయ్య గౌడ్
పెద్దపల్లి జిల్లా మంథని రేణుక ఎల్లమ్మ దేవాలయం చైర్మన్ గా తాటి బాలయ్య గౌడ్, డైరెక్టర్లు కొండ్ర శ్రీనివాస్ గౌడ్, శివయ్య గౌడ్, ఆర్ల వసంత, దేవాలయ పూజారిగా మాచిడి మంజుల నరేష్, గార్లను నియమిస్తూ రాష్ట్రమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం సాయంత్రం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియమకం పట్ల మంథని గౌడ సంఘం అధ్యక్షుడు మాచిడి వీర శంకర్ గౌడ్, వారి పాలకవర్గ సభ్యులు, కృతజ్ఞతలు తెలుపుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొన్నం చంద్రబాబు, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్