పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణ మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. దేవునిపల్లి జాతరలో భాగంగా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయంలో నిర్వహించిన ఈ కళ్యాణ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్చకుల వేద మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారి కళ్యాణం ఘనంగా జరిగింది. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.