భవిత సెంటర్ లో విద్యార్థుల సంఖ్య పెంచాలి: కలెక్టర్

1చూసినవారు
భవిత సెంటర్ లో విద్యార్థుల సంఖ్య పెంచాలి: కలెక్టర్
పెద్దపల్లి జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల ఆవరణలో నిర్మించిన నూతన భవిత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివ్యాంగ విద్యార్థులు భవిత సెంటర్‌కు రెగ్యులర్‌గా హాజరు కావాలని, వారి సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రిజిస్టరైన విద్యార్థులు తప్పనిసరిగా సోమవారం నుంచి శుక్రవారం వరకు సెంటర్‌కు రావాలని, వారం రోజులలో రెండు సార్లు విద్యార్థులకు ఫిజియోథెరపీ చేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్