మంథనిలో సింగరేణి ఆర్జీ-1 ఏరియా జీఎం కార్యాలయం ఎదుట అధికారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న ఈ దీక్షల్లో అదనపు మేనేజర్ రాజేంద్ర ప్రసాద్, జేఎంఓ ఎం. సత్యనారాయణ, నూతి శ్రీనివాస్, ఏరియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. వి. శ్రీనివాసరావు, మెడికల్ సూపరింటెండెంట్ డా. టి. సబిత పాల్గొని సంఘీభావం తెలిపారు. ఉన్నతాధికారుల మద్దతు ఉద్యమానికి బలాన్ని చేకూర్చిందని, పలువురు అధికారులు ప్రత్యక్షంగా దీక్షల్లో పాల్గొనడం హర్షణీయమని నాయకులు పేర్కొన్నారు.