పెద్దపల్లి జిల్లా మంథనిలోని కూరగాయల మార్కెట్లో వినియోగదారులు కూరగాయలు తాజాగా ఉన్నాయని, అయితే ధరలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. వ్యాపారస్తులు మాట్లాడుతూ, సాధారణంగా చలికాలంలో కూరగాయల ధరలు తక్కువగా ఉండాలని, కానీ అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. దీనివల్ల వినియోగదారులకు, తమకు ఇబ్బందిగా ఉందని వ్యాపారులు పేర్కొన్నారు.