పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అభివృద్ధి పనులు, బతుకమ్మ, దసరా సంబరాలకు ప్రత్యేక ఏర్పాట్లు, నూతన ఇండికేట్ మార్కెట్ పనులపై చర్చించారు. ఇండికేట్ మార్కెట్‌ను మూడు రోజుల్లో ప్రారంభిస్తామని చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, కమిషనర్ ఎన్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.