పెద్దపల్లి: వృద్ధులకు అవసరమైన సహాయం అందిస్తాం: అదనపు కలెక్టర్

631చూసినవారు
పెద్దపల్లి: వృద్ధులకు అవసరమైన సహాయం అందిస్తాం: అదనపు కలెక్టర్
పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ వేణు మాట్లాడుతూ, వృద్ధులకు అవసరమైన వాకర్స్, చతికరలు అందజేస్తామని తెలిపారు. కొడుకు, కూతుళ్లతో ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే దిశగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్