పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, మహిళలు ప్రభుత్వం అందించే సహకారాలను సద్వినియోగం చేసుకొని వ్యాపార రంగంలో రాణించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. వీ హబ్, సెర్ఫ్ సంస్థలు సంయుక్తంగా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు, మహిళలకు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి.