వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లి వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ కారణంగా అధికారులు అత్యవసర మరమ్మతులు చేపట్టారు. దీనితో వేములవాడ - జగిత్యాల ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసి, నూకలమర్రి మీదుగా మళ్లించారు. వేములవాడ నుంచి జగిత్యాల, కొండగట్టు వైపు వెళ్లే ప్రయాణికులు చెక్కపల్లి, ఎదురుగట్ల, నూకలమర్రి మార్గంలో ప్రయాణించాలని సూచించారు.