పెద్దపల్లి: మట్టిలో మాణిక్యం.. సైక్లింగ్ సంచలనం

10చూసినవారు
పెద్దపల్లి: మట్టిలో మాణిక్యం.. సైక్లింగ్ సంచలనం
మంథని, గుంజపడుగుకు చెందిన ఉదారి సాహిత్య అండర్-14 సైక్లింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తోంది. 2024-25లో ఇప్పటికే 12 పతకాలు సాధించగా, తాజాగా సీఎం కప్‌లో రెండు రజతాలు, జాతీయ స్థాయి ఖేలో ఇండియాలో ఒక రజత పతకాన్ని గెలుచుకుంది. ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై దేశ జెండా ఎగరాలంటే, ఇలాంటి యువ క్రీడాకారులను చిన్నతనం నుంచే ప్రోత్సహించాలని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేడు ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం సందర్భంగా ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్