రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కీలక పాత్ర పోషించనున్నారు. పట్టణంలోని మొత్తం 1,83,049 ఓట్లలో 90వేలకు పైగా వీరివే. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. 8 ఇంక్లైన్, 5 ఇంక్లైన్ వంటి కార్మిక కాలనీల్లో ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు తమ గెలుపునకు కార్మికుల మద్దతు అత్యవసరమని విశ్వసిస్తున్నారు.