పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ పాఠశాలలో చదువుతున్న ఏకైక పదో తరగతి విద్యార్థి గుంటి మధు 429 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. విద్యార్థి పాఠశాలకు రాకపోయినా, ఉపాధ్యాయులు పట్టుదలతో ఇంటికెళ్లి పాఠాలు చెప్పి అతన్ని పాస్ చేయించారు. దీంతో పాఠశాల జీరో పర్సెంట్ ఫలితాల నుంచి బయటపడి, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.