పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తొలిరోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మున్సిపల్ పరిధిలోని మొత్తం 36 వార్డులకు గానూ 50 మంది అభ్యర్థులు 52 నామినేషన్ పత్రాలను దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మరో రెండు రోజులపాటు కొనసాగనుంది.