పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనే జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ, పెద్దపల్లి బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ కోటగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఐటిఐ కాలేజీ మైదానం లేదా మార్కెట్ యార్డ్ లో జిల్లా కోర్టు భవనాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ ఏఓ బండి ప్రకాష్ కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.