వైభవంగా చెన్నకేశ్వరస్వామి భక్తోత్సవం

0చూసినవారు
వైభవంగా చెన్నకేశ్వరస్వామి భక్తోత్సవం
పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి భక్తోత్సవం (కళ్యాణం) అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం చెరుకు మహేందర్ రెడ్డి, పద్మజ దంపతుల ఆధ్వర్యంలో జరిగే ఈ స్వామివారి కళ్యాణాన్ని పడిదం స్మిత శ్రీనివాస్ రెడ్డిల చేతుల మీదుగా వేదపండితులు కృష్ణమాచారి, ఉపేందర్ ల మంత్రోచ్ఛారణల మధ్య కన్నుల పండువగా జరిపించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య హోమ పూజ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి, అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్