సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అక్షర వికాసం ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ఆదేశాల మేరకు మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించారు. చదువు రాని మహిళలను గుర్తించి, వారికి పుస్తకాలు పంపిణీ చేసి, వాలంటీర్ల ద్వారా చదువు చెప్పించి, 2, 3, 4, 5, 6, 15వ వార్డు గ్రూప్ మహిళలకు దర్జీ భవన్‌లో పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధాకృష్ణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.