దులికట్టలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

458చూసినవారు
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దులికట్ట గ్రామంలో నిన్న సాయంత్రం ఏడు గంటలకు వివిధ కూడలిలో ఏర్పాటు చేసిన ప్రాంగణాలలో చిన్న బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, పిల్లలతో కలిసి ఒకచోట బతుకమ్మను ఉంచి, 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో' అంటూ తిరుగుతూ కోలాటాలతో ముత్యాలు చేస్తే బతుకమ్మను పూజిస్తూ ఆనందాలతో ఈ తొమ్మిది రోజులు సంబరాలను నిర్వహించుకుంటామని మహిళలు తెలిపారు.