పెద్దపల్లి మున్సిపల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 62 కోట్ల 23 లక్షలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే విజయరమణరావు గత పదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని పెద్దపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా కంకణబద్ధులయ్యారని తెలిపారు.