ఈనెల 26న జాతీయ మాలమహానాడు ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కట్టేకోల మధు పిలుపునిచ్చారు. పెద్దపల్లిలో మంగళవారం ఛలో ఢిల్లీ కరపత్రాన్ని ఆవిష్కరించిన ఆయన, పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని, జాతీయ స్థాయిలో మాలల కమిషన్ ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ చట్టం తీసుకురావాలని, ఎస్సి రిజర్వేషన్లను 15 నుండి 20 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగే సభలో జిల్లా నుండి మాలలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.