తాగునీటి సరఫరాపై చిల్లపల్లి సర్పంచ్ ప్రత్యేక దృష్టి

2చూసినవారు
తాగునీటి సరఫరాపై చిల్లపల్లి సర్పంచ్ ప్రత్యేక దృష్టి
చిల్లపల్లి గ్రామ పంచాయతీలో తాగునీటి సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు బోర్‌వెల్ నుండి OHSR ట్యాంక్ వరకు కొత్త పైప్‌లైన్ కనెక్షన్ పనులు చేపట్టారు సర్పంచ్ గోపు సంతోష్. ఈ సందర్బంగా పంప్ ఆపరేటర్‌కు అవసరమైన సూచనలు ఇవ్వడంతో పాటు, పైప్‌లైన్ పనుల కోసం JCB యంత్రాన్ని ఏర్పాటు చేశారు. అంగన్‌వాడీ భవనం నిర్మాణ పనుల సమయంలో పైప్‌లైన్ దెబ్బతినడంతో ఏర్పడిన సమస్యను త్వరితగతిన పరిష్కరించి గ్రామస్తులకు తాగునీరు అందించే పనులను వేగవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాంకిషోర్, వార్డ్ సభ్యులు పిక్కల రజిత సాగర్, అక్కపాక సునీత లింగయ్య తదితరులు పాల్గొన్నారు.