పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. పట్టణంలో టియూ ఎఫ్ఐడిసి కింద మంజూరైన పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని, మార్చి 31 నాటికి ఆస్తి పన్ను, ట్రెడ్ లైసెన్స్, నీటి పన్ను వంటి అన్ని పన్నులను 100 శాతం వసూలు చేయాలని ఆదేశించారు. తడి, పొడి చెత్తను వేరుగా సేకరించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసేవారిపై జరిమానాలు విధించాలని సూచించారు.