విద్యార్థుల ఇబ్బందిని దూరం చేసిన దాస్ సేవా సమితి

2చూసినవారు
విద్యార్థుల ఇబ్బందిని దూరం చేసిన దాస్ సేవా సమితి
పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం దాస్ సేవా సమితి ఆధ్వర్యంలో రూ. 1.30 లక్షల విలువైన 25 బెంచీలను బుధవారం అందజేశారు. విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు లేక ఇబ్బంది పడుతున్నారని ఉపాధ్యాయులు తెలపడంతో స్పందించిన దాస్ సేవా సమితి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి స్కూల్స్ సీఈఓ మల్కా యశస్వి సహకారంతో ఈ వితరణ చేపట్టింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేల్పుల రమేష్, ఉపాధ్యాయులు, దాస్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్