
హ్యాంగోవర్ నుంచి త్వరగా కోలుకోవడానికి టిప్స్!
న్యూ ఇయర్ పార్టీ తర్వాత వచ్చే హ్యాంగోవర్ తో నుంచి కోలుకోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలు వివరించారు. నిద్రలేవగానే ఒక గ్లాసు నీటితో రోజును ప్రారంభించాలి. అల్లం, పుదీనా టీ తాగడం వల్ల వికారం తగ్గుతుంది. కాఫీ డీహైడ్రేషన్‌ను పెంచుతుంది. శరీరానికి శక్తినిచ్చే ఆహారాలు, అరటిపండు, కొబ్బరి నీళ్లు, సూప్‌లు తీసుకోండి. మద్యం తాగే ముందు కడుపు నిండా ఆహారం తీసుకోండి. తీపి పానీయాలతో మద్యం కలపవద్దు. నిమ్మరసం తాగడం వల్ల డీహైడ్రేషన్ తగ్గుతుంది.




