ఈశ్వరచారి కుటుంబానికి కోటి ఎక్స్ గ్రేషియా చెల్లించాలి

515చూసినవారు
బీసీ రిజర్వేషన్ల కోసం హైదరాబాద్‌లో ఆత్మాహుతి చేసుకున్న సాయి ఈశ్వరా చారి కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని బీసీ జేఏసీ జిల్లా చైర్‌పర్సన్‌ దాసరి ఉషా డిమాండ్ చేశారు. శనివారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్షను కలిసి బీసీల పట్ల జరుగుతున్న సామాజిక దాడులు వెంటనే నిలిపివేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఇటీవల నల్గొండలో జనరల్ స్థానంలో పోటీకి నామినేషన్ వేసిన బీసీ అభ్యర్థి భర్త పట్ల జరిగిన అనాగరిక సంఘటన సభ్య సమాజానికి మాయని మచ్చగా ఆమె అభివర్ణించారు.