పెద్దపల్లిలోని గాయత్రి విద్యానికేతన్ పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్
ఇండియా ఆధ్వర్యంలో ‘ఎక్సలెన్స్ అవార్డు–2026’ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్
ఇండియా శాఖ మేనేజర్ సుమన్, అసిస్టెంట్ మేనేజర్ వినయ్, లీగల్ అడ్వైజర్ రవీందర్ ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు, మెమోటోస్ అందజేసి అభినందించారు.