మంటల్లో చిక్కుకొన్న రైతు.. చికిత్స పొందుతూ మృతి

0చూసినవారు
మంటల్లో చిక్కుకొన్న రైతు.. చికిత్స పొందుతూ మృతి
సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామంలో రైతు తోటపల్లి పోచాలు (52) వరికొయ్యలు తగులబెడుతుండగా ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. గత నెల 28న జరిగిన ఈ దుర్ఘటనలో శరీరంపై తీవ్ర గాయాలైన ఆయనను కుటుంబ సభ్యులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఆయన మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

సంబంధిత పోస్ట్