ప్రభుత్వ విప్ విజయరమణరావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఎలిగేడులో మంగళవారం రైతు వారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పెసర్లు, జొన్నలు, కందులు వంటి సాంప్రదాయ పంటల నుండి వరి వైపు మళ్లారని, ఇది లాభదాయకం కాదని అన్నారు. రైతులు పంట మార్పిడి చేపట్టి, మార్కెట్ డిమాండ్ ఉన్న లాభదాయక పంటలపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఆయిల్ ఫామ్ రైతులకు చెక్కులు పంపిణీ చేశారు.