భూపతిపూర్ బ్రహ్మోత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

68చూసినవారు
భూపతిపూర్ బ్రహ్మోత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలో సోమవారం శ్రీ భూ నీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఆయనను శాలువాతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్