శనివారం, పెద్దపల్లి జిల్లా జూలపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుంట్ల రాజశేఖర్ రెడ్డి కడెం ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనను గమనించిన ఇరిగేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సాయికిరణ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఉపాధ్యాయుడి మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.